ఆమె పేరులోనే కీర్తి ఉంది. ఇక ఆమె రేంజ్ ఏం తగ్గుతుంది. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా అయిపోయింది. కీర్తి సురేష్ గురించే ఈ మాటలన్నీ. ‘మహానటి’ తరువాత కీర్తి సురేశ్ రేంజ్ బాగా పెరిగిపోయింది. మహానటి తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదలై హిట్ అందుకుంది. దీంతో కీర్తి సురేశ్ తెలుగులోనే కాదు వేరే భాషల్లో కూడా ఆఫర్స్ రావడం ప్రారంభించాయి. నిజానికి కీర్తి సురేశ్ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే మళయాళంలో పలు సినిమాల్లో నటించింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కీర్తి సురేశ్ ని హీరోయిన్ గా పెట్టి పెంగ్విన్ అనే సినిమా నిర్మించాడు. థియేటర్స్ మూసి ఉండటంతో ఈ సినిమాను అమెజాన్ వారు 10 కోట్లు పెట్టి కొనుక్కొని వారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ చేశారు. కీర్తి సురేశ్ సినిమా కావడంతో పెంగ్విన్ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేసినా వ్యూయర్ బాగానే చూశారు. అయితే సినిమా అంతగా లేదు, కానీ కీర్తి నటనకు మాత్రం బాగా పేరు వచ్చింది. దీంతో కీర్తి నటించిన సినిమాలు అమెజాన్ ప్రైమ్ కన్నేసింది.
కీర్తి అప్ కమింగ్ మూవీ మిస్ ఇండియా కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తే భారీ మొత్తంలో చెల్లిస్తామంటూ ఆ సినిమా నిర్మాతలకు అమెజాన్ వారు ఓ డీల్ ఆఫర్ చేశారట. దాదాపు 6 కోట్లకు మిస్ ఇండియాను కొనుక్కునేందుకు అమెజాన్ వారు ముందకువచ్చినట్లుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు కీర్తి మార్కెట్ తగ్గిపోయిందనే రూమర్స్ కి ఈ అమెజాన్ వారు ఆఫర్ చేసిన డీల్ చెక్ పెట్టినట్లు అయింది. కీర్తి సురేశ్ మరో మూవీ రంగ్ దే కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్, నితిన్ కలిసి నటించారు. సతార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి డైరెక్టర్.











