టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ కు కొడుకు పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తన తండ్రి పేరునే (పరిటాల రవీంద్ర) కొడుకుకు పెట్టాడు శ్రీరాం. తాజాగా కుమారుడి అన్నప్రాసన వేడుకను ఘనంగా జరిపారు. బంగారునగలు, డబ్బు, పుస్తకం, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులను కుమారుడి ఎదుట పెట్టారు. బుడి బుడి అడుగులు వేస్తూ… డైరెక్ట్ గా కత్తిని పట్టుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు. అన్నప్రాసనలో కత్తి పట్టడంతో ‘’మళ్లీ పరిటాల రవి‘‘ పుట్టాడంటూ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
Must Read ;- కేసులకు భయపడం, తిరగబడే రోజులొస్తాయ్.. పరిటాల శ్రీరామ్











