పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పాన్ ఇండియా స్టార్ రానా కాంబినేషన్ లో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం.
ఈ మూవీ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం.. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ ప్రత్యేకంగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్ లో పవన్ – రానా పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ కు రూ. 2 కోట్ల ఖర్చు అయినట్టు తెలిసింది. ఇందులో కథానాయికలు సాయిపల్లవి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. తమిళ యాక్టర్ సముద్రఖని కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. అయితే.. రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాల్సివుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ చిత్రాలు రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.
Must Read ;- పవన్ మరో దర్శకుడికి ఓకే చెప్పారా? ఎవరా డైరెక్టర్?