Pawan Kalyan And Trivikram Release Srisri Book :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకరచయిత త్రివిక్రమ్.. ఇద్దరూ పుస్తక ప్రియులే అనే సంగతి తెలిసిందే. పైగా ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. మహాకవి శ్రీశ్రీ రచనల్లో ‘మహాప్రస్థానం’కు ఎలాంటి పేరుందో అందరికీ తెలుసు. అందులోని ఒక్కో కవితకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి మహాప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ‘భీమ్లానాయక్’ సెట్ లో పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ కు అందజేశారు. ఈ సెట్ కు త్రవిక్రమ్ వచ్చారు. ఈ సినిమా విషయంలో త్రవిక్రమ్ తన సహకారాన్ని అందజేస్తున్నారు.
వీరిద్దరి మధ్యా శ్రీశ్రీ కవితలు, సాహిత్యం ప్రస్తవన వచ్చింది. ఆ విషయాలను ఇద్దరు గుర్తుచేసుకున్నారు. మహాకవి శ్రీశ్రీ ఒక శిఖరం లాంటి వారని త్రివిక్రమ్ అన్నారు. అప్పుడప్పుడూ వీరిద్దరి మధ్యా సాహితీ చర్చలు నడుస్తుంటాయి. ఒక్కో సందర్భంలో ఒక్కో కవికి సంబంధించిన ప్రస్తావన వస్తుంటుంది. శ్రీశ్రీ మహాప్రస్థనంపై చాయా చిత్రాలతో తాను రాసిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కు అందజేశారు. అలా కొన్ని పంచ్ లు కూడా పడ్డాయి. ఓ కవి మరో కవి గురించి చెబుతుంటే సొబగు బాగుందని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గురించి పంచ్ వేయడంతో నవ్వులు విరిశాయి.
Must Read ;- పవన్ వెర్సెస్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ వార్ లో విన్నర్ ఎవరు?











