పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొంతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో భారీ పిరియాడిక్ చేస్తున్నారు. అలాగే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కి కూడా పవన్ చేస్తున్నారు.
ఇందులో పవన్ – రానా కలిసి నటిస్తుండడం విశేషం. ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ ఓ మూవీ చేయనున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని పవర్ స్టార్ పుట్టినరోజున రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ .. సినిమా పై అంచనాలను పెంచేసింది. అయితే.. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. అది ఏంటంటే.. ఇందులో పవన్ ఐబి ఆఫీసర్ గా కనిపిస్తారట.
అది కూడా క్లైమాక్స్ లో మాత్రమే పవన్ ఐబీ ఆఫీసర్ అని తెలుస్తుందట. అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయట. పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. ఈసారి హరీష్ శంకర్ పవన్ కి ఏ స్ధాయి విజయాన్ని అందిస్తారో చూడాలి.