జీహెచ్ఎంసీ ఎన్నికలనుంచి తప్పుకోవడం అనేది పెద్ద త్యాగం అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ… అందుకు పరిహారం అన్నట్లుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని పుచ్చుకోవడానికి పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. మంతనాలు సాగిస్తున్నారు. అంతవరకు ఓకే గానీ.. విశ్వసనీయంగా తెలుస్తున్న సమచాారాన్ని బట్టి.. ఆయన కోరిక నెరవేరకపోవచ్చునని అనుకుంటున్నారు.
బీజేపీ తిరుపతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభ్యర్థినే బరిలో దింపాలని చూస్తోంది. ఏపీలో వైసీపీ,టిడిపికి ప్రత్యామ్నాయం గా మారలనుకుంటున్న సమయంలో జనసేనకి సీటు ఇవ్వడం ఆత్మహత్యా సదృశం అవుతుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీసీటుకు పోటీచేసే అవకాశాన్ని వదులుకునేది లేదని బిజెపి నాయకులు అంటున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు తిరుపతిలోనే తిష్టవేసి, అభ్యర్థి ఎంపిక, ఎన్నికల వ్యూహం రచిస్తున్నారు. మంగళవారం కూడా ఓ మీటింగ్ పెట్టుకున్నారు.
జనసేన మాత్రం తిరుపతిలో మాకు ఛాన్స్ కావాలంటోంది. పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికలకు దూరమైన అసంతృప్తిలో ఈడిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కంటే జనసేన బలంగా ఉంది- గెలిచే అవకాశాలు ఉన్నాయనేది వారి వాదన అయితే గతంలో ఇక్కడ తమకు గెలిచిన చరిత్ర కూడా ఉన్నదని బీజేపీ నేతలు అంటున్నారు. 1999 లో బిజెపి నుంచి తిరుపతి ఎంపీగా ఎన్ వెంకట స్వామి గెలుపొందారు. మోడీ హయాంలో రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ తిరుపతిలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బిజెపి భావిస్తోంది.
Must Read ;- కేసీఆర్ స్కెచ్ ప్రకారమే.. జనసేన బరిలో ఉంటోందా?