‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ పేరుతో ఫ్యాన్ మేడ్ పోస్టర్ నెట్ లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కు ఇది 28 సినిమా కావడంతో పీఎస్ పీకే 28గా ఈ సినిమాని పిలుస్తున్నా దీనికి సంబంధించి ఓ టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఈ టైటిల్ ను అధికారికంగా ఎవరూ కన్ ఫర్మ్ చేయలేదు. ఈ సినిమా విశేషాను వెల్లడించాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు.
సినిమా టైటిల్ గురించి ఎలాంటి ఊహాగానాలూ చేయవద్దని కూడా కోరారు. ‘స్టేట్ కి ఒక్కడు’ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు వినికిడి. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న టైటిల్ కూడా ఇదే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. పక్కా కమర్షియల్ అంశాలతో ఊరమాస్ టైటిల్ తో మాత్రం ఈ సినిమా ఉంటుందని మాత్రం దర్శకుడు హరీష్ శంకర్ అంగీకరిస్తున్నారు.
వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ఒకటి ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. మరో సినిమా మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత జరిగింది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది. సాగర్ కె. చంద్ర దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హరిహర వీరమల్లు పెద్ద ప్రాజెక్టు కావడం వల్ల ముందుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను ముందుగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలో దీన్ని విడుదల చేస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతికి హరిహర వీరమల్లు విడుదల చేయాలన్నది నిర్ణయం. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు.
మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందట. ఇవి కాక మరో సినిమాను కూడా పవన్ అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజతో ఖిలాడి రూపొందిస్తున్న రమేష్ వర్మ తో ఈ సినిమా ఉండొచ్చన్నది సమాచారం. అంటే దాదాపు నాలుగు సినిమాలను పవన్ లైన్ లో పెట్టారు. పరిస్థితులు అనుకూలిస్తే వరుసగా ఈ సినిమాలు సెట్స్ మీదికి వెళతాయి.
Must Read ;- సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ రీమేక్ మూవీ