ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్‌షాక్ ఇచ్చారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. స్మగ్లర్లతో చేతులు కలిపిన ఇద్దరు అటవీశాఖ ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత కొన్నేళ్లుగా పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన పీలేరు రేంజ్ ఫారెస్ట్ అధికారులపై పవన్ చర్యలు తీసుకోవడం ద్వారా..పెద్దిరెడ్డికి గట్టి సంకేతాలు పంపారు. 2021లోనే స్మగ్లర్లకు సహకరిస్తూ అధికారులు పట్టుబడినప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకు సంబంధించిన ఫైళ్లను పవన్ కళ్యాణ్ స్వయంగా బయటపెట్టారు. పెద్దిరెడ్డి అండతో అధికారులు, అక్రమార్కులు చెలరేగిపోయారు.
శేషాచలం అడవుల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసిన సమయంలోనే, అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్దల హస్తంపై పవన్ అవగాహనకు వచ్చారు. కేవలం కింది స్థాయి సిబ్బందిపైనే కాకుండా,వారి వెనుక ఉన్న రాజకీయ శక్తులను దెబ్బకొట్టేలా పవన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను తిరగదోడి, ఆధారాలతో సహా నిరూపించి మరీ వేటు వేస్తున్నారు. తద్వారా పెద్దిరెడ్డి అవినీతి కోటకు బీటలు వారేలా చేస్తున్నారు.
వైసీపీ పాలకుల అండతో సాగిన దందాలకు కాలం చెల్లిందని, స్మగ్లర్లకు సహకరించే అధికారుల విషయంలో జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని ఈ నిర్ణయం ద్వారా వార్నింగ్ పంపారు. మొత్తంగా, పెద్దిరెడ్డికి ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనే ప్రక్షాళన మొదలుపెట్టడం ఆయనకు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి.











