పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ‘వకీల్ సాబ్’ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కు ముందు థియేటర్స్ లోకి వచ్చిన లాస్ట్ సినిమా ఇదే. దీని తర్వాత ఇంకే సినిమాలు రాలేదు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్స్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే. చాలా సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. అందులో పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఒకటి.
క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీ. అలాగే.. ఆయన నటిస్తున్న తొలి జానపద సినిమా కూడా ఇదే. మొఘలాయిల కాలంలోని నేపథ్యంలో సాగే.. పీరియాడికల్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. పవన్ వీరమల్లు అనే గజదొంగ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో పవన్ పాత్ర కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే అంశం హైలైట్ కానుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమాకి సంబంధించిన టీజర్ ఎప్పుడొస్తుందనే ఆసక్తితో ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ పవర్ స్టార్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న విడుదల కాబోతోందట. అంతవరకూ ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్టేట్ కూడా రాదని అంటున్నారు. ఈ సినిమా కోసం మొఘలాయిల కాలం నాటి సెట్స్ ను నిర్మిస్తున్నారు. దీనికోసం అత్యంత భారీగా ఖర్చుచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న జానపద సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
Must Read ;- జూలై వరకూ నో షూట్స్ అంటున్న పవర్ స్టార్