లాక్ డౌన్ తర్వాత విడుదల కానున్న మొట్ట మొదటి భారీ చిత్రం ‘వకీల్ సాబ్’. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గానూ విశేషాన్ని సంతరించుకున్న సినిమా. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకుడు. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథనంలోనూ, ఆయన పాత్రలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Vakeel Saab Wraps Up Sensor With U/A :
ఈ నేపథ్యంలో రీసెంట్ గా జరిగిన ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను వీక్షించిన సెన్సార్ సభ్యులు దీనికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేస్తూ.. సినిమా కథాంశాన్ని, పవర్ స్టార్ అభినయాన్ని ప్రశంసించారు. ముగ్గురమ్మాయిల్ని ఓ క్రిమినల్ కేసు నుంచి వకీల్ సాబ్ ఎలా తప్పించాడు? దాని కోసం ఆయన ఎలా పాటుపడ్డాడు అనే అంశాలు ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి.
అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో, కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మరో పిల్లర్ లాంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించారు. తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే విడుదలైన సింగిల్స్ .. అభిమానుల్ని ఆకట్టుకోగా.. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు రికార్డ్ వ్యూస్ వచ్చి పడ్డాయి. మరి ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న వకీల్ సాబ్ మూవీ.. ఎన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందో చూడాలి.
Must Read ;- గ్రాండ్ గా పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విశేషాలెన్నో.. !
It's 𝐔/𝐀#VakeelSaab wraps up censor and is all set for a grand release on Apr 9th@PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @MusicThaman @BoneyKapoor @BayViewProjOffl @adityamusic #VakeelSaabOnApril9th pic.twitter.com/4fdultB564
— BARaju (@baraju_SuperHit) April 5, 2021