పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ పీరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో ‘హరి హర వీరమల్లు’ సినిమా సంక్రాంతికి రావడం లేదని టాక్ వినిపిస్తోంది.
అయితే… పవన్ కళ్యాణ్.. దగ్గుబాటి రానాతో కలసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో నటిస్తున్నారు. దీనికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందిస్తున్నారు. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నట్టు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా, కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయిది. కరోనా కేసులు తగ్గడం.. లాక్ డౌన్ ఎత్తేయడంతో షూటింగ్ లు మళ్లీ స్టార్ట్ అయ్యాయి.
ఈ క్రమంలో ‘అయ్యప్పనున్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడం వలన సెప్టెంబర్ లో రిలీజ్ చేయడం సాధ్యం కాదు. అందుచేత ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. మరి.. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ రీమేక్ మూవీ











