మన దేశంలో రాజకీయాలకు, నేరస్తులకు అవినాభావ సంభందముంది. బయట తిరుగుతున్న నేరస్తుల కంటే రాజకీయాల్లోనే నేరారోపణ ఎదుర్కొంటున్న నేరస్తులు ఎక్కువగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు, మాజీలకు సంబంధించి 4,400కు వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటెనే పరిస్థతి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. నేరాలు చేసి రాజకీయాల్లో పోతే సేఫ్ గా ఉండొచ్చనే భావనతో చాలా మంది మాజీలు, తాజాలు రాజకీయాలను సేఫ్ ట్రాక్ గా వాడుకుంటున్నట్లు ప్రజల్లో ఆ భావన ఉంది.
అసలు చట్టాలను చట్టసభల్లో ఎందుకు చేస్తారు?…సుపరిపాలన, అవినీతిలేని పాలన, నేరాలకు ఎవ్వరూ పాల్పడకుండా, నేరాలను తగ్గించడం, పేదరిక నిర్మూలన లాంటి అంశాలను తీసుకొని చట్టాలను చేస్తారు. మరీ ఆ చట్టాలను చేసే ఎంఎల్ఏ లు, ఎంపిల వ్యక్తిగత చరిత్ర, రజాకీయ చరిత్ర ఎలా ఉండాలి. ఎలాంటి నేరారోపణులు లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన దేశంలో రాజకీయాల గురించి మాట్లాడితే నేరాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ నేరస్తులే మనలను పాలిస్తున్నారు, వాళ్ళు చేసిన చట్టాలనే మనం పాటించాల్సి వస్తుంది. దాదాపు దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరు ఇదొక కేసులో బుక్ అయినవారే. చాలామంది నేతలు బెయిల్ లపైనే బయట తిరుగుతున్నవారే.
హైదరాబాద్ లో 13 మందిపై సిబిఐ కేసులు
అయితే ఇప్పుడు ఈ నేతల పని పట్టడానికి సుప్రీం కోర్ట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. కేసులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్‌పై కేంద్రం సుముఖుత వ్యక్తం చేయడంతో ఏడాదిలోగా కేసుల విచారణ చేపట్టాలని సుప్రీం ఆదేశించే అవకాశం ఉంది. మరి ఒక వేళ వీరిపై వస్తున్న నేరారోపణలు రుజువైతే వారి పరిస్థతి ఏంటి. జైలు ఊచలు లెక్కించాల్సిందేనా?. తెలంగాణలోని తాజా, మాజీ ప్రజాప్రతినిదులపైన 118 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ కు చెందిన 13 మందిపై సిబిఐ కేసులు ఉన్నాయి. సాధారణ జరిమాన శిక్ష కేసు స్థాయి నుంచి జీవత ఖైదు స్థాయి కేసులు వీరిపై ఉన్నాయి.ఏకంగా హైదరాబాద్ లోని ఓ ఎంఎల్ఏపై జీవిత ఖైదు విధించే స్థాయి కేసు ఉన్నట్లు సమాచారం. సిబిఐ, ఈడి, ఎఫ్ఐఆర్ లు నమోదైన చాలా మందిపై కేసు విచారణలు నెమ్మదిగానే నడుస్తున్నాయి.
యాక్షన్ ప్లాన్ రెడీ…
నేరచరిత గల నేతల కేసుల పరిష్కారానికి సుప్రీం త్వరతగతిన విచారణ చేపట్టే దిశగా హైకోర్టులకు సుప్రీం పలు సూచనలు చేసింది. వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. 9 అంశాలను యాక్షన్ ప్లాన్‌లో చేర్చాలని సుప్రీంకోర్టు వివరించింది. ప్రతి జిల్లాలోని పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య..అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీ కాలం, ప్రతి న్యాయమూర్తి ఎన్ని కేసులు పరిష్కరించగలరో పొందుపర్చాలని పేర్కొంది. స్టే ఉన్న కేసులను కూడా 2 నెలల్లో కొలిక్కి తీసుకురావాలని తాజాగా పేర్కొం కోర్టుల మధ్య దూరం, మౌలిక సదుపాయాలను కూడా యాక్షన్ ప్లాన్‌లో చేర్చాలని సూచించింది. ది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో కేసుల పురోగతి, అమికస్ క్యూరీ ఇచ్చిన సిఫార్సులపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది.