మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని..జూనియర్ NTR పరువు తీసేశారు. ప్రముఖ జర్నలిస్టు జాఫర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని..జూనియర్ NTR పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి పేర్ని చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయ వర్గాల్లోనూ ఈ కామెంట్స్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇంతకీ నాని ఏమన్నారు –
జూనియర్ NTR తాను పదే పదే NTR, నందమూరి వారసుడినని చెప్పుకుంటారని, అతను రాజకీయాల్లోకి వస్తే ఎవరి మాడు పగిలిపోద్ది అంటూ కామెంట్స్ చేశారు. జూనియర్ రాజకీయాల్లోకి వస్తే జగన్‌కు ఏం సంబంధం అన్నారు. అంటే జూనియర్ రాజకీయాల్లోకి వస్తే పెద్దగా ఎఫెక్ట్ ఉండదనే అభిప్రాయాన్ని నాని వ్యక్తం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని , వల్లభనేని వంశీ వైసీపీని వీడుతారా అని జాఫర్ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే, కొడాలి నాని జగన్ మోహన్ రెడ్డిని విడిచిపెట్టరని తాను గట్టిగా చెబుతానని, ఒకవేళ అలా జరిగితే దానికి తాను బాధ్యత తీసుకుంటానని నాని బలంగా నొక్కి చెప్పారు. అయితే, వల్లభనేని వంశీ గురించి అడిగినప్పుడు, వంశీతో తనకు అంత చనువు లేదని, ఆయన మనసులో ఏముందో తనకు తెలియదని, అందుకే ఆయన గురించి వ్యాఖ్యలు చేయలేనని చెప్పారు.
ఎన్టీఆర్‌కి రాజకీయాలలోకి అడుగుపెట్టినా అంత సీన్ ఉండదని, ఆయన ఒక పొలిటికల్ ఫోర్స్‌గా మారి, ముఖ్యమంత్రి అయ్యే అంత స్థాయి లేదని అభిప్రాయ పడ్డారు నాని.. గతంలో ఎంతోమంది సినీనటులు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఎలాంటి సత్తా చాటలేక వెనకబడిపోయారని గుర్తు చేశారు.. ఎన్టీఆర్ కూడా ఆ జాబితాలోనే మిగిలిపోతారని పేర్ని నాని అభిప్రాయంలా కనిపిస్తోంది.. మొత్తమ్మీద, పేర్ని నాని కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.











