చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాలు ఎదుర్కొంటున్న సీఎం జగన్‌కు మునుముందు మరిన్ని ఇబ్బందులు తప్పటం ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్రానికి కొంచెం కూడా సమాచారం ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేయించి నెల రోజుల నుంచి తిప్పలు పెడుతూ జైల్లో ఉంచిన జగన్ త్వరలో తగినమూల్యం చెల్లించుకోవటం ఖాయంగా కనిపిస్తోందని పొలిటికల్ ఎనలిస్ట్‌ల టాక్.
ఎన్డీయే నుంచి చంద్రబాబును దూరం చేసిన వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ పెద్దలు పునరాలోచనలో పడ్డారు. జనసేన కూడా తెలుగుదేశంతో జత కట్టడంతో ఆ ఆలోచనకు మరింత బలం చేకూరింది. లాభ నష్టాలు బేరీజువేసుకునేలోగా చంద్రబాబు అరెస్టయ్యాక జగన్ ఢిల్లీకి రావడంతో కేంద్రం కారాలు మిరియాలూ నూరింది. సీఎం జగన్‌కు చెప్పాల్సిందంతా గట్టిగానే చెప్పి పంపేసిన బీజేపీ పెద్దలు తదుపరి కార్యాచరణపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. తాజాగా ఢిల్లీలో అమిత్ షాని కలిసి జగన్ సర్కార్ మద్యం పాలసీపై ఆమె ఓ నివేదిక అందజేశారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని కోరారు.. దీంతో, లిక్కర్ స్కామ్‌పై హస్తిన హై కమాండ్ ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే టెన్షన్… వైసీపీ వర్గాలలో ఉందట..
మరోవైపు, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం త్వరలో ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలలో పరిస్థితులను సర్వేల రూపంలో బేరీజు వేసుకుంటోంది.. ఇందులో భాగంగా ఏపీలోని తాజా పరిణామాలు, బాబు అరెస్ట్, వైసీపీకి గ్రౌండ్లో ఉన్న ప్రజా అనుకూల, వ్యతిరేక వర్గాల అభిప్రాయాలను సమీక్షించుకుంటోందని సమాచారం..
ఇటీవల వరుస సర్వేలను కేంద్రం నేతలు కూలంకశంగా పరిశీలిస్తున్నారు. జాతీయ ఛానెళ్ల సర్వేల సంగతెలా ఉన్నా ఆత్మసాక్షి వంటి సంస్థల సర్వేలతో పాటు, ఏపీ బీజేపీ నేతలు ఇచ్చిన సర్వేలను పరిశీలించాక మోడీ – అమిత్ వ్యూహం మారిందని తాజా పరిణామాల తర్వాత అర్థమవుతోంది. ఈనేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ ఆరెస్ట్, కేసులు, తదనంతర పరిణామాలపై సీఎం జగన్ దూకుడు తగ్గిందని స్పష్టమవుతోంది. అందుకే, జగన్ ఎంతగా డిమాండ్ చేసినా, ముందస్తు ఎన్నికలకు లైన్ క్లియర్ చేయలేదని ఢిల్లీ వర్గాల సమాచారం..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం, జనసేన జట్టుతో జత కట్టడమే మేలని బీజేపీ హై కమాండ్ ఓ నిర్ణయానికొచ్చింది. జగన్‌కు దగ్గరవడం వల్ల ఎదురైన, ఎదురవుతున్ననష్టాలనూ అంచనా వేసిన మోడీ-అమిత్ షాలు ఈ వ్యూహాన్ని త్వరలోఅమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించబోతున్నారట.