ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 15 – 20 మధ్యలో ఏపీకి రానున్నారు.. ఆయన పర్యటన దాదాపు ఖాయం అయింది.. రాజధాని అమరావతి 2.oని వైభవంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.. దీనికోసం ఇప్పటికే ప్రధాని మోదీ ని ఆహ్వానించింది చంద్రబాబు ప్రభుత్వం. పీఎమ్‌వో నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, తేదీ ఫిక్స్ కాలేదు.. వచ్చే నెల 15 – 20 మధ్య ఏదో ఒక తేదీన మోదీ ఏపీలో పర్యటించనున్నారని తెలుస్తోంది..
అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మించాలని చంద్రబాబు ఎన్నో కలలు కన్నారు.. దీనికోసం 32 వేల ఎకరాలను ఆయన సమాయత్తం చేశారు.. అధికారం మారడంతో జగన్ వికృత రాజకీయ ఆడాడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని శ్మశానంలా మార్చారు.. 2014 – 19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన అమరావతి పునాదులను అంతే వదిలేసింది జగన్ సర్కార్.. వల్లకాడుగా మార్చింది. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడింది..
జగన్ మూడు రాజధానులని ప్రజలు అసహ్యించుకున్నారు.. అందుకే, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని వడివడిగా పట్టాలెక్కించింది.. ఇటు సుమారు 40 వేల కోట్ల రూపాయల నిధులను సైతం సమకూర్చుకుంది.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ 13 వేల కోట్ల రూపాయలు, హడ్కో సంస్థ 13 వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇవ్వడానికి అంగీకరించాయి.. ఆ నిధులను త్వరలోనే కేటాయించనున్నాయి..
ఇక, అమరావతి నిర్మాణ పనులకు ఇటీవల టెండర్లు జారీ చేశారు.. కొన్ని కంపెనీలను కూడా ఫైనలైజ్ చేశారు.. ప్రధాని మోదీతో శంకుస్థాపనల తర్వాత ఇక వేగంగా ఏపీ కలల రాజధానిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు.. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని మార్పిడి ప్రస్తావనే లేకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మోదీ సభతో జగన్ ఏపీకి ముఖ్యంగా అమరావతికి చేసిన అన్యాయాన్ని గుర్తు చేయాలని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు.. అంతేకాదు, మోదీతో ఆంధ్రప్రదేశ్‌కి కొన్ని హామీలు, వరాలను పొందాలని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు… అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితి నుండి మినహాయించారు.. ఇటు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను త్వరగా అమరావతిలో నిర్మాణాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని, వాటికి తగిన క్లియరెన్స్లని సైతం క్లియర్ చేయాలని కోరనున్నారని తెలుస్తోంది..
ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ నడుస్తోంది.. ఇటు, కేంద్రంలోనూ ఈ కూటమి పవర్లో ఉంది.. ఇది కలిసి వచ్చే అంశం.. అందుకే, అమరావతికి మోదీని తీసుకురావడంతో దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అమరావతికి కొత్త ఇమేజ్ తీసుకురావాలని భావిస్తోంది.. మరి, చంద్రబాబు సర్కార్ అమరావతిని ఏ రేంజ్లో పరుగులు పెట్టిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది..