మహిళలపై పోలీసులు అరాచకం!
ఏపీలో రాక్షస పాలనకు అద్దంపడుతోంది. అందుకే పోలీసులు కీచక పాత్ర పోషిస్తున్నారు కాబోలు అన్నట్లు విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఓ మహిళలపై పోలీసులు దాడి చేసి, చీరను లాగేయ్యడం వంటి చర్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ దురదృష్టకర సంఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే చోటు చేసుకోవడం గమనార్హం! మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే వైసీపీ నేతల కోసం దుశ్శాసన పర్వాన్ని సాగించడం తీవ్ర విచారకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి పాలనలో టీడీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు పెరిగియన్నారు.
అధికారపార్టీ నేతలకు కొమ్ము కాస్తూ.. చట్టాలను కాలరాస్తారా?
అధికారపార్టీ నేతలకు కొమ్ముకాస్తూ.. చట్టాలను ఏపీ పోలీసులు కాలరాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దఅన్నలూరు గ్రామంలో అధికార పార్టీ నేతలు అక్రమ లేఅవుట్ వేస్తున్నారు. గ్రామకంఠం భూములను ఆక్రమించుకుని లేఅవుట్ వేస్తున్నారని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విచక్షణ రహితంగా వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ప్రతిఘటించిన ఓ మహిళ చీరను పోలీసులు లాగారు. దీనిపై స్థానికలు మండిపడుతున్నారు. పోలీసు చర్యలు క్షమార్హం కాదని విపక్షాలు ఆగ్రహం వక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ పోలీసులపై కేసు నమోదు చేసి, సస్సెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Must Read:-సాక్షి రిపోర్టర్ ని ఆడుకున్న నారా లోకేష్ 🤣 | Nara Lokesh Punch on Reporter in LIVE Press Meet