కృష్ణా జిల్లాలో ఓ పోలీసు దొంగగా మారాడు. చోరీకి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ కొన్నాళ్లుగా చెడు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం తప్పుడు మార్గాలు పట్టాడు.ఈ క్రమంలోనే కైకలూరులోని ఓ దుకాణం కు వెళ్ళిన సత్యనారాయణ దుకాణం యజమానురాలుని బెదిరించి ఆమె మెడలో గొలుసు లాక్కునే ప్రయత్నం చేశాడు.ఆ మహిళ పెద్దఎత్తున కేకలు వేయడంతో స్థానికులు కానిస్టేబుల్ సత్యనారాయణను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కానిస్టేబుల్ తో పాటు ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు
కమిడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరో స్థాయి కి చేరిన...