సీమ ప్రతాపం పేరుతో అధికారపార్టీ కుయుక్తులు!
సీమ వాసుల ప్రేమాభిమానాలకు కొలమానాలుండవు. అటువంటి వారి వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసేలా అధికారపార్టీ కుయుక్తులను పన్నుతోంది. అడుగడుగునా పోలీసులతో అంక్షలను అమలు చేస్తూ… రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలానే రైతుల బసకు ఏర్పాట్లు చేస్తున్న స్థానికులను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భోజనాల చేయడానికి, రాత్రి బసచేయడానికి ఏర్పాట్లు చేయడానికి ముందుకొస్తున్న స్థానికులను రౌటీషీటర్లను విచారించినట్లు విచారిస్తున్నారు పోలీసులు. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లెకు రైతు పాదయాత్ర చేరుకోగానే అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో జనం రైతులకు ఘన స్వాగతం పలికారు. అమరావతి రాజధానికి పూర్తి మద్దతు ప్రకటించారు. సీమలో తొలిరోజు సాగుతున్న రైతు పాదయాత్రకు అడుగడుగునా పూల వర్షాలు కురిపించి స్వాగతించారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం శ్రేణులు రైతుల పాదయాత్రను స్వాగతించి, సంఘీభావం తెలిపారు. రైతుల వెంట మేము కూడా అంటూ మమేకమై సాగారు. దారి పోడవున పాదయాత్ర బృందానికి జననీరాజనాలు పలికారు. అయితే పాదయాత్ర బృందం మధ్యాహ్నం భోజనం చేయడానికి శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామం వద్ద ఆగాల్సి ఉండగా అక్కడ అధికారపార్టీ రాజకీయం చేసి భోజనం తినకుండా చేసింది. దీంతో మనస్తాపం గురైన రైతులు అరకిలోమీటరు దూరంలో వేరే రైతు భూమిలో బస చేసేందుకు అనుమతించడంతో అక్కడికి వెళ్లి భోజనం చేయాల్సి వచ్చింది.
రైతు సభకు అందుతున్న అనూహ్య మద్దతు.. పాదయాత్రలో ఢిల్లీ రైతులు!
రైతులు తిరపతిలో ఈనెల 17న నిర్వహించే మహాసభకు పార్టీలకు అతీతంగా అన్నిరాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఢీల్లీ రైతులు కూడా అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మూడు రోజులు రైతులతో ఉండి పాదయాత్రలో పాల్గొంటామని వెల్లడించారు. తిరుపతిలో నిర్వహించనున్న రైతు సభకు ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో రైతు సంఘాల నేతలు హాజరౌతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే రైతు పాదయాత్రలో పోలీసు చర్యలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఎటుచూసిన పోలీసు వాహనాలు, బలగాలే పెద్దఎత్తున పాదయాత్రలో దర్శనమిస్తున్నాయి. పాదయాత్ర కదలికలను అడుగడుగునా ప్రైవేటు వీడియో గ్రాఫర్లతో రికార్డు చేస్తున్నారు. నిబంధనలు పాటించాలి .. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించరాదు అంటూ తదితర ఫ్లకార్డులతో మహిళా పోలీసులు పాదయాత్ర ముందుభాగాన నిలవడంతో పాదయాత్ర నిర్వహాకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- అధికారపార్టీలో తగ్గిన జోష్..! డైలామలో ఫ్యాన్ కేడర్!!











