(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసు జారీ చేశారు. విశాఖలో ఉన్న అచ్చెన్నాయుడుకు శ్రీకాకుళం పోలీసులు ఈ నోటీసు అందజేశారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ముందు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, పాలేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ఘటనల్లో ఈ నోటీసు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల సంతబొమ్మాళి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో విగ్రహాల ధ్వంసం, పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్‌లో విగ్రహ రగడ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో టీడీపీ నాయకులు ఘటనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Must Read ;- రామతీర్ధంలో కేసులో.. A1గా చంద్రబాబు!