విజయనగరం జిల్లా రామతీర్ధం ఘటనపై పోలీసులు దూకుడు పెంచారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నడికుడి ఈశ్వరరావుతో పాటు మరో పది మంది కార్యకర్తలను శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 29వ తేదీన విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థంలో.. కొండపై వెలిసిన ఆలయంలోని దుండగులు రాముడి విగ్రహం తలను విరగ్గొట్టి.. ఎత్తుకుపోయిన సంగతి.. అనంతరం జరిగిన పరిణామాలు తెలిసినవే.
ఈవో అటాచ్
రామతీర్థం కోదండ రామాలయం ఈవో కిశోర్‌ను హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: తిరుపతి బరిలో బీజేపీ… వైసీపీ, టీడీపీల్లో ఎవరికెంత నష్టం