టాలీవుడ్ లో ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. ప్రస్తుతం అమ్మడి సినిమాల లైనప్ చూస్తే మతిపోతుంది. ఒక పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూజా.. మరో పక్క మెగాస్టార్ ‘ఆచార్య’ లో రామ్ చరణ్ పెయిర్ గా నటిస్తోంది. అలాగే అఖిల్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ లోనూ నటిస్తోంది. మరో పక్క దళపతి విజయ్ తో ఓ మూవీకి కమిట్ అయింది. అదే చేత్తో అటు బాలీవుడ్ లోనూ ఓరేంజ్ లో మూవీస్ సెట్ చేసుకుంది.
ప్రస్తుతం పూజా .. లాక్ డౌన్ టైమ్ ను వివిధ టాస్కులకు కేటాయించుకుంది. స్ర్కిప్ట్స్ చదవడానికి, ఇష్టమైన వినైల్ రికార్డులు వినడానికి, యోగా చేయడానికి వినియోగించుకుంటోంది. అలాగే.. సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో యాక్టివ్ గా ఉంది. తాజాగా బుట్టబొమ్మ.. తన ఇన్ స్టా ఖాతాలో లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన వీడియో రీల్ ను పోస్ట్ చేసింది.
అందులో పూజా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో పాటు ఫుట్ వేర్, మేకప్ కిట్ తో సహా పలు హాట్ పోజులను ప్రదర్శించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా హెగ్డే హాట్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. రకరకాల పోజులతో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అమ్మడి ఫోటోషూట్ కు ఓ రేంజ్ లో స్పందన లభిస్తోంది.
Must Read ;- కజిన్ ఆఫ్ అనన్యా పాండే .. ఏంజిల్ ఆఫ్ హాట్ నెస్