పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు – స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. దీనికి విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ తాజా షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ బాలయ్య డైరెక్టర్ తో సినిమా చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ బాలయ్య డైరెక్టర్ ఎవరంటారా..? తాజాగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. పవర్ స్టార్ కోసం బోయపాటి పవర్ ఫుల్ పొలిటికల్ స్టోరీ రెడీ చేశారని.. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల టైమ్ కి ఈ సినిమా చేయనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది.
ఓ వైపు పాలిటిక్స్, మరో వైపు సినిమాలు చేస్తూ.. పవన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వచ్చే రెండేళ్ల వరకు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు చెయ్యడమే గగనంలా అనిపిస్తుంది. ఇక బోయపాటితో సినిమా అంటే అదెప్పుడు స్టార్ట్ అయ్యేది.? ప్రస్తుతానికి అయితే.. అసలు ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు బోయపాటి బన్నీతో సినిమా చేసేందుకు కథ రెడీ చేస్తున్నారు. అందుచేత ప్రస్తుతానికి అయితే పవన్ తో బోయపాటి ప్రాజెక్ట్ లేదు. మరి.. ఎన్నికల టైమ్ కి ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందేమో చూడాలి.











