పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ అని అందరికీ తెలిసిందే. యాక్టింగ్ తో పాటు మార్షల్ ఆర్ట్స్, దర్శకత్వం , నిర్మాణం, కథలు రాయడం లాంటి పలు అంశాల్లో ఆయనకి మంచి ప్రవేశం, ప్రవీణ్యం రెండూ ఉన్నాయి. వీటితో పాటు మరో రంగంలో కూడా ఆయన టాలెంటెడ్. అదేనండీ.. పాటలు పాడడంలో. అందులోనూ జానపద పాటలు. ‘తమ్ముడు, ఖుషీ, జానీ, గుడుండా శంకర్, అత్తారింటికి దారేది, అజ్ఞాతివాసి’ లాంటి సినిమాల్లో పవర్ స్టార్ జానపద పాటలు అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఇప్పుడు మరోసారి పవన్ .. తనలోని జానపద కళాకారుడ్ని బైటికి తీయబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి.
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ గా తెరకెక్కుతోన్న సినిమా కోసం పవర్ స్టార్ ఓ ఫోక్ సాంగ్ పాడబోతున్నాడట. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో రెండు మూడు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ ఫోక్లోర్ స్టైల్లోనే ఉంటాయి. తెలుగు లో కూడా అదే స్టైల్లో ఒక పాట ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు సాగర్. కే చంద్ర. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ స్వయంగా తెలిపాడు. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్కీన్ ప్లే , మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి పవర్ స్టార్ సాంగ్.. ఈ సినిమాకి ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.
Must Read ;- పవర్ స్టార్ కి పెంచల దాస్ డైలాగ్స్ ?