పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఓకే చేస్తూ టాలివుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రావడం లేటవుతుంది కాని రావడం మాత్రం పక్కా అన్నట్టు పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం కొంచెం లేట్ అయినా వరసగా మూడు సినిమాలతో రావడం మాత్రం పక్కా అని తేలిపోయింది. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా సెట్స్ పై ఉంది. ఈ మధ్యనే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత క్రిష్ తో ఒక సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు పవన్.
ఈ మూడు సినిమాల తర్వాత పవన్‌కళ్యాణ్ మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారంటూ టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అలాగే సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకున్నట్టూ తెలిసింది. ఈ సినిమాలో పవన్ తో పాటుగా రానా కూడా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. కాని తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ ఈ సినిమాకు నో చెప్పాడని తెలుస్తోంది. పవన్ త్వరలో ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. సింగల్ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంభందించిన బాలన్స్ షూటింగ్ పూర్తి చేసి వెంటనే క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు పవన్. వెనువెంటనే మరల హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు.
ఆ సినిమాలు పూర్తయ్యేసరికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉండటంతో తన కోసం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ చిత్ర యూనిట్ అంత కాలం వేచి ఉండటం ఇష్టం లేకే పవన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయినా ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ దర్శక నిర్మాతలు త్వరలోనే పవన్ ను మరల సంప్రదించి ఎలాగైనా ఈ సినిమాను పట్టాలెక్కించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని టాలీవుడ్ టాక్. ఏదిఏమైనా సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకోని మరల పవన్ వరుస సినిమాలను ఓకే చేస్తుండడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.