టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలం గ్యాప్ తీసుకోని ఈమధ్యనే వరుస సినిమాలను ఓకే చేస్తూ కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా కోసం పవన్ లిక్విడ్ డైట్ స్టార్ట్ చేశారని సమాచారం. గత రెండు సంవత్సరాలు ఆయన రాజకీయాలలో తీరిక లేకుండా గడిపారు. తన లుక్ కోసం అస్సలు కేర్ తీసుకోలేదు. అయితే పవన్ తాజాగా తన సరికొత్త లుక్ కోసం లిక్విడ్ డైట్ స్టార్ట్ చేశారు.
‘వకీల్ సాబ్’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉందని, అందులో సన్నగా కనిపించాలని ఇప్పటికే చిత్ర బృందం పవన్ కు తెలిపిందని సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్ ను పవన్ కోసమే ప్రత్యేకంగా దర్శకుడు వేణు శ్రీరామ్ డిజైన్ చేశాడని సమాచారం. ఇక సినిమా విషయానికి వస్తే టీజర్ కోసం పవన్ అభిమానులు కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ ఫస్ట్ లుక్ కి సంబంధించి భారీ రెస్పాన్స్ వచ్చింది కూడా. పవన్ కం బ్యాక్ చిత్రం కావడంతో ‘వకీల్ సాబ్’ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉంటుందని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు అభిమానులకు హామీ ఇచ్చాడు.
వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి అస్సలు గ్యాప్ తీసుకోకుండా వెంటనే క్రిష్ మూవీ షూటింగ్ లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్. మరి ‘వకీల్ సాబ్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి పవన్ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తాడో లేదో చూడాలి.











