పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ‘వకీల్ సాబ్’ మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ గా మారిన ఈ సినిమా ఓటీటీలోనూ మ్యాజిక్ చేసింది. ఇక దీని తర్వాత అందరి దృష్టి .. ‘హరిహర వీరమల్లు’ సినిమా మీదే ఉంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ జానపద సినిమా .. పవర్ స్టార్ కు మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కానుంది.
మొఘలాయిల పాలనలో ‘వీరమల్లు’ అనే బందిపోటు దొంగ.. పేద ప్రజలకు అండగా ఎలా నిలిచాడు అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో కోహినూర్ వజ్రం ప్రస్థావన కూడా ప్రధానంగా ఉండబోతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రిన్సెస్ గా కనిపించబోతోంది. ఏప్రిల్ 6వరకూ ఏకథాటిగా షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. కరోనా సెకండ్ వేవ్ వల్ల దానికి అంతరాయం ఏర్పడింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ నెలాఖరుకు తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతోందనే టాక్స్ వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ కూడా షూటింగ్ కు రెడీ గా ఉన్నారట. ఈ షెడ్యూల్ లో జాక్వెలిన్ , బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కూడా పాల్గొంటారట. రాజీవన్ డిజైన్ చేసిన మొఘల్ సామ్రాజ్యం సెట్స్ సినిమాకి హైలైట్ కానున్నాయట. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానున్న హరిహరవీరమల్లు పవర్ స్టార్ కు ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.
Must Read ;- సూపర్, పవర్ స్టార్లు అలా స్పందిస్తేనే హీరోయిజం!