ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్ లో స్పీడు పెంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ఇంకా డేట్ కన్ ఫర్మ్ కాలేదు. అయితే.. గత రెండు రోజుల నుంచి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ.. ప్రచారంలో ఉన్న వార్తలో విజమెంత అని ఆరా తీస్తే.. అసలు విషయం బయటకు వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావడం లేదట. కారణం ఏంటంటే.. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా డిసెంబర్ రెండో వారం నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. నార్త్ లో ప్రభాస్ తో భారీగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారట.
అందుచేత ప్రభాస్ పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రాలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో బన్నీ పుష్ప ఈవెంట్ కు గెస్ట్ ఎవరైతే బాగుంటారా.. అని ఆలోచనలో పడ్డారట పుష్ప మేకర్స్. ఈమధ్య పుష్పక విమానం అనే చిన్న సినిమాకి అఖండ అనే పెద్ద సినిమా ఫంక్షన్ కి బన్నీ గెస్ట్ గా వెళ్లారు. ఇప్పుడు బన్నీ ఫంక్షన్ కి గెస్ట్ గా ఎవరు రానున్నారో అనేది ఆసక్తిగా మారింది.అల్లు అర్జున్ ‘పుష్ప’లో సమంత ఐటమ్ సాంగ్
Must Read ;-











