టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎంత లాభాలు ఉంటాయో అదే స్థాయిలో నష్టాలు ఉంటాయి. ఇతర వ్యక్తులు ఈజీగా మన పర్సనల్ డేటాని కూడా ఉపయోగించే అవకాశం కూడా ఈ టెక్నాలజీ ఇస్తోంది. ‘స్పై వేర్’ టెక్నాలజీ సాయంతో మన వ్యక్తిగత విషయాలను కూడా హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారు. ఈ స్పై వేర్ టెక్నాలజీ జీపిఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో మన ప్రతి కదలిక అది గుర్తిస్తోంది. స్పై వేర్ మన ఫోన్ లో ఉందని గుర్తించడం కూడా కష్టమే. దీంతో ఈ మధ్య కాలంలో వరుసగా ప్రముఖులు హ్యాకింగ్ కు గురయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశ ప్రధాని వ్యక్తిగత ట్విట్టర్, మొబైల్ యాప్ లు హ్యాక్ అయ్యాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మోడీకి దాదాపు 2.5 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3:15 గంటలకు ప్రధాని పర్సనల్ డేటా హ్యాక్ అయినట్లు గుర్థించరు. దీనిని నిర్దారించిన ట్విట్టర్ విచారణ జరుపుతున్నట్లు ప్రకటించింది. ప్రధానికి సంబదించిన డేటా హ్యాక్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎథికల్ హ్యాకర్స్ అయితే పర్వాలేదు కానీ పరాయి దేశం హ్యాకర్స్ అయితే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి హ్యాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కూడా హ్యాకర్ల బారిన పడ్డ సంగతి తెలిసిందే. అగ్ర రాజ్యం అమెరికాలో కూడా ఈ బెడద తప్పడం లేదు. యూఎస్ఏ ఎన్నికలలో పోటీ చేస్తున్న జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ ఖాతాలు కూడా హ్యాకింగ్ కు గురయ్యాయి.