హాటు లుక్కులందు ప్రియాంక లుక్కులు వేరయా అన్నట్టుగా, ఆమె ఒక్కో హాట్ లుక్ ను ఒక్కో అస్త్రంలా వదులుతోంది. ఈ అందాల అస్త్రాలు యువకుల గుండెల్లో మృదువైన ముల్లులా గుచ్చుకుంటున్నాయి. ఓపలేని తీపి బాధకు గురిచేస్తున్నాయి. అలాంటి ఓ హాట్ లుక్కునే ప్రియాంక మళ్లీ వదిలింది. హెయిర్ ఆయిల్ ప్రమోషన్ కి రెడీ అవుతున్నట్టుగా ఈ సుందరి ఈ ఫొటోలో కనిపిస్తోంది. అప్పుడే జలకాలు పూర్తయినట్టుగా బాత్ టవల్ చుట్టుకుని, కురులను ఆరబెట్టుకుంటోంది. తాను కళ్లు మూసుకుని కుర్రాళ్లకు రెప్పలాడకుండా చేస్తోంది.
తడి తడి అందాలు కనిపిస్తే మనసు మడి కట్టుకు కూర్చుంటుందా ?అందుకే అందాల చుట్టూనే కళ్లన్నీ కందిరీగలై తిరుగుతున్నాయి. అందం ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి తహతహలాడుతున్నాయి. నూనె పట్టించిన ఆమె శరీరం అందమైన అద్దంలా మెరుస్తూ ఉంటే, ఆ అద్దంలో తమని తాము చూసుకోవడానికి కుర్రాళ్లు ఆరాటపడుతున్నారు. ఒక్కసారి కళ్లు తెరిచి తమని చూపులతో అభిషేకించమని చెప్పడానికి అవస్థలు పడుతున్నారు. ఈ శృంగార దేవతలతో ఇదే చిక్కు.
అసలైన అందాలు చూసినప్పుడే కళ్ల దాహాలు తీరతాయి .. ఆ అందాలపై పందెం గెలిచినప్పుడే మనసు ఆకలి తీరుతుంది. అలాంటి ఆకలి దప్పులను తీర్చే అజంతా శిల్పంలా ఇక్కడ ప్రియాంక చోప్రా కనిపిస్తోంది. అటు సెగసెగలాడే ఒళ్లు .. ఇటు నిగనిగలాడే కురులు .. రెండిటినీ ఒక్కసారిగా చూస్తూ ఆస్వాదించడానికి కొంచెం ధైర్యం కావాలి .. మరికొంచెం సాహసం చేయాలి. ప్రియాంక నల్లని కురులు చూస్తుంటే, అదేదో సినిమాలో “పట్ట పగలెవరైనా రాతిరిని చూశారా? తన కురులు చూపిస్తా ఔననక చస్తారా?” అంటూ సిరివెన్నెల రాసిన పాట గుర్తొస్తోంది కదూ!
Must Read ;- టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి