ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఈ బాలీవుడ్ బ్యూటీ అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను 2018లో ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రియాంక బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంటే.. నిక్ జోనస్ హాలీవుడ్ మూవీస్ లో నటిస్తూ.. పాటలు పాడుతున్నారు. ఇద్దరూ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. పర్సనల్ లైఫ్ ని బ్యాలాన్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రియాంక చోప్రా క్వారం టైన్ టైమ్ లో లాస్ ఏంజిల్స్ లో తన భర్త నిక్ జోనాస్ తో స్పెండ్ చేశారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్ చిత్రం టెక్ట్స్ ఫర్ యూ. ఈ సినిమా షూటింగ్ ఇటీవల లండన్ పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రానికి జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రిచర్డ్ మాడెన్ సరసన నటిస్తుంది. ఆమె వర్కవుట్స్ చేయడం గురించి ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
క్వారం టైన్ టైమ్ లో తన భర్తతో కలిసి ఎలా వర్కవుట్స్ చేసిందో తెలియచేసింది. ప్రతి రోజు ఉదయం 8.30 నిమిషాలకు హిందీ ర్యాప్ వింటూ వర్కవుట్స్ చేసేదాన్ని. ప్రస్తుతం సిటాడెల్ తో బిజీగా ఉన్నాను. అలాగే ఓ సిరీస్ లో నటించేందుకు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను. అయితే..క్వారం టైన్ టైమ్ లో నేను వర్కవుట్స్ స్టార్ట్ చేసినప్పుడు బేబీ బాగా చేస్తున్నావ్ అంటూ నిక్ ప్రొత్సహించేవారు. ఆతర్వాత జంటగా వర్కవుట్స్ చేసేవాళ్లం.
అప్పుడుకలిసి వర్కవుట్స్ చేస్తున్నప్పుడు నాకు ఫరవాలేదు అనిపించింది. అయితే.. అతనితో పోటీపడడం అనేది నరకంలా అనిపించింది. అతను 255 పుష్ అప్స్ చేశాడు. అందుకనే అతనిలో కలిసి ఇంకెప్పుడు వర్కవుట్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పింది ప్రియంకా చోప్రా.
Must Read ;- యూకే మేగజైన్ కోసం ప్రియాంక హాట్ లుక్











