దిల్ రాజు అంటే తెలుగు సినిమా రంగంలో ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది . అంటే స్క్రిప్ట్ సెలక్షన్ లో మాస్టర్ అని . సుకుమార్, బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, వాసు వర్మ , వేణు శ్రీ రామ్, వంశి పైడిపల్లి లాంటి దర్శకులను పరిచయం చేశారు. విభిన్నమయిన ప్రేమ కథలను, ఫామిలీ డ్రామాలను నిర్మించి, దిల్ రాజు అనే పేరు బ్రాండ్ గా మార్చుకున్నారు. తమిళం లో విజయవంతమయిన ‘96’ సినిమా ని తెలుగు లో ‘జానూ’ అనే పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత జంటగా నటించిన ‘జానూ’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘పింక్’ హిందీ సినిమా ని ‘వకీల్ సాబ్’ గా తీస్తున్నారు. రీసెంట్ గా మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘ హెలెన్ ‘ అనే థ్రిల్లర్ రైట్స్ కొన్నారు దిల్ రాజు . రవిబాబు వద్ద పలు సినిమాలకు పని చేసిన హనుమంత రావు అనే కుర్రోడ్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రూ అండ్ కేస్టింగ్ ఇతర వివరాలు తెలియలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందట.











