సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ హాలీవుడ్ స్టార్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ బాక్సర్ స్టోరీతో హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని ఆగస్టు 25న తెలుగు హిందీతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలిసి మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. ఈ ప్రాజెక్ట్ ని లైగర్ తరువాత స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులోనూ విజయ్ దేవరకొండ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే సమాచారం ప్రకారం.. ఏప్రిల్ లో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభం కానుందని తెలిసింది. లైగర్ లో లాంగ్ హెయిర్ తో బాక్సర్ గా కనిపించిన విజయ్ దేవరకొండ జనగణమన సినిమాలో మాత్రం షార్ట్ హెయిర్ తో కనిపించనున్నాడు. మిలటరీ హెయిర్ కటింగ్ తో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇప్పటికే లొకేషన్ ల రెక్కీని నిర్వహించిన టీమ్ ఫస్ట్ షెడ్యూల్ కోసం ఆసక్తికరమైన ప్లేస్ ని ఫిక్స్ చేసిందట. ఫస్ట్ షెడ్యూల్ ని సౌత్ ఆఫ్రికలో ప్రారంభించడానికి ఇప్పటికే పూరి జగన్నాథ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. మరి.. లైగర్, జనగణమన చిత్రాలతో విజయ్, పూరి ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.