Protest Rallies Faced By Ruling Party Leaders In Flood Hit Areas
అడుగడుగునా ఆగ్రహవేశాలు, నిరసన సెగలు!
సకాలం స్పందించకుండా సర్వం కోల్పొయిన తరువాత వచ్చి బ్రతికే ఉన్నారా? అని పరామర్శిస్తారా? మీరు మనుషులేనా? అని అధికారపార్టీ ప్రజాప్రతినిధులను వరద బాధితులు నిలదీస్తున్నారు. మొన్న అనంతపురం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణలను వరద బాధితులు అడ్డుకున్నారు. చనిపోయిన, మొత్తం నాశనం అయిన తరువాత మీ సహాయ సహకారాలు మాకే వద్దు అని సీరియస్ అయ్యారు. వరద సహాయక చర్యలు, ప్రభుత్వ స్పందన వంటివాటిలో జగన్ రెడ్డి ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందింది. అండగా నిలవాల్సిన అధికారపార్టీ వరద సమయంలో పూర్తిగా చేతులెత్తెసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలను, మంత్రులను బాధితులు ఎక్కడిక్కడ అడ్డకుంటున్న పరిస్థితి చూస్తునే ఉన్నాం. చిత్తూరు జిల్లాలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, మంత్రి బాలినేని పై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద వచ్చి.. ఇళ్లు, పంటలు, అయినవారిని కోల్పోయి సర్వనాశనమైతే ..కనీసం వచ్చి పరామర్శించలేక పోయారు. ఇప్పుడొచ్చి అది చేస్తాం.. ఇది ఇస్తాం .. అంటే నమ్మాలా? అని నిలదీశారు.
సీఎం సొంత జిల్లాలోనే కట్టలు తెంచుకున్న సెగలు ..
సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వరద భాదితులు నిరసనలు అధికారపార్టీ నేతలకు ఒక రేంజ్ లో తగులుతున్నాయి. కడపలో అన్నమయ్య ప్రాజెక్ట్ కట్టతెగి పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, గుండ్లూరు గ్రామాల్లో వరద సృష్టించిన బీభత్సం హృదయ విదారకం. ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జలను వరద బాధితులు అడ్డుకున్నారు. జరగాల్సిన నష్టం జరిగికా ఇప్పుడొచ్చి ఏం లాభమని మండిపడ్డారు. రాయచోటిలో ప్రభత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని వరద బాధితులు నిలదీశారు. గరుగుపల్లెలో ఇళ్లు దెబ్బదిన్న వారికి పరిహారం చెక్కులు ఇచ్చేందుకు వచ్చిన శ్రీకాంత్ రెడ్డిని బాధితులు ప్రశ్నించారు.
Protest Rallies Faced By Ruling Party Leaders In Flood Hit Areas
డిసెంబర్ 2 సీఎం పర్యటన .. ఏం జరిగిద్దో చూడాలి!
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే గాల్లో పర్యటించి, అధికారులతో నివేదికలు తెప్పించుకున్న సీఎం జగన్ రెడ్డి .. డిసెంబర్ 2న వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించనున్నారు. వరద బాధితులతో ముఖాముఖి నిర్వహించి వారి కష్టాలను తెలుకోవాలని రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే మంత్రులకు, ప్రభుత్వ చీఫ్ విప్, సలహాదారు లకు వరద బాధితుల నుంచి తాకిన సెగలు … ముఖ్యమంత్రి పర్యటనలో కూడా రిపిట్కాక మానవని విమర్శలు లేకపోలేదు. వరదల సమయంలో పెళ్లి విందు భోజనాలు తినుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేసిన ముఖ్యమంత్రి పై ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అలానే అధికారపార్టీ నేతల పర్యటనలు కూడా జాప్యం కావడంతో బాధితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదేస్థాయిలో అధికారపార్టీ నేతల పర్యటనలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో బాధితులు ఏ విధంగా రియాక్ట్ అవుతారోనని సొంతపార్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ వ్యాపార అప్పుల కోసమే .. రాష్ట్రం అప్పులు పాలు!