జీవితంలో కాంట్రాక్ట్ వర్కులు ఒప్పకోం.. పెండింగ్ బిల్లులివ్వండి!
జీవితంలో ఏపీ కాంట్రాక్ట్ వర్కులు ఒప్పకోం.. పెండింగ్ బిల్లులివ్వండి.. ప్లీజ్ అంటూ స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు రోడ్డెక్కి ఆందోళన దిగారు. దశలు వారీగా నగరాల్లో ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లు తాజాగా విశాఖలో ‘ఆవేదన -4’ తో నిరసనను చేపట్టారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు నల్ల చొక్కాలతో పెద్ద సంఖ్యలో హాజరై నిరసన తెలిపారు. నాడు – నేడు కిందా చేసిన అభివృద్ధికి సంబంధించిన బిల్లులు రాక, బ్యాంకులు నుంచి తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నామని వాపోయ్యారు. నాడు – నేడు, జల్ జీవన్ మిషన్ పనులకు డబ్బులు చెల్లించలేదని, సీఎం దశలవారీగా విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా లేరని వాపోయ్యారు. చివరికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన పనులకు సైతం ఇప్పటి వరకూ బిల్లుల మంజూరు కాలేదని కాంట్రాక్టర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెయ్యి కోట్ల వరకు బకాయిలు.. రాబట్టుకునేందుకు ఐక్య కార్యచరణ!
చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించిన మొత్తంగా వెయ్యి కోట్ల రూపాయల మేరకు ఏపి ప్రభుత్వం బకాయి పడింది! వాటిని క్లియర్ చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తిలేదని కాంట్రాక్టర్లు చెప్పుకొస్తున్నారు. కాంట్రాక్టర్లందరూ ఒకతాటిపైకి వచ్చి ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేసేందుకు ఐక్య కార్యచరణ ప్రకటించారు. ప్రాధాన్యత క్రమంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము నిర్వహిస్తున్న పనుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, వారందరూ నేడు జగన్ రెడ్డి కారణంగా రోడ్డున పడ్డారని వివరించారు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఇదే సమస్య వస్తే.. అప్పడప్పుడు ఆయన ప్రత్యేకంగా జీవో ఇచ్చి నిధులు మంజూరు చేసారని కాంట్రక్టర్లు గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.
Must Read ;- సీఎం జగన్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం..!











