బాంబే హీరోయిన్లని ఎవరనైనా హిందీ ఉండగా ఎందుకు తెలుగులో సినిమాలు చేయడానికి వస్తారని అడిగితే వారు వచ్చిరానీ తెలుగులో చెప్పే సమాధానం ఒక్కటే, ఇక్కడ హీరోయిన్లని రాణులు మాదిరిగా ట్రీట్ చేస్తారు, బాలీవుడ్ లో చెలికత్తెలుగా పరిగణిస్తారని ముద్దుగా చెబుతారు. అయితే అందరి హీరోయిన్స్ కి తెలుగు వారు నుంచి క్వీన్ రేంజ్ ట్రీట్ మెంట్ లభించదు, అందుకు ఆ ముద్దుగుమ్మలకి సక్సెస్ లు ఉండాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. తెలుగుతో పాటు హిందీలో కూడా పూజా తనదైన శైలిలో హవా కొనసాగిస్తోంది.
ప్రస్తుతం పూజా చేతిలో సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో పూజానే హీరోయిన్, అలానే ప్రభాస్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ రాథే శ్యామ్ లో కూడా పూజా కథనాయకిగా నటిస్తోంది. దీంతో పాటు నాగ చైతన్య, జూనియర్ యన్టీఆర్, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాల్లో పూజాను హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలిసింది. మొత్తానికి కెరీర్ స్టార్టింగ్ లో మొత్తం ఫ్లాపులతో కొనసాగిని పూజా కెరీర్ ఇప్పుడు మూడు సినిమా ఓపెనింగ్ పూజులు నాలుగు సాంగ్ షూట్ షెడ్యూల్స్ తో బాగానే బిజీగా ఉంది.