ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, వైసీపీ కీలక నేత, ఆ పార్టీలో నిన్నమొన్నటివరకు నెంబర్ 2గా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం సాగుతోంది.. నాలుగన్నరేళ్లుగా జగన్ సర్కార్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై యుద్ధం మొదలుపెట్టారు పురంధేశ్వరి.. జగన్ పాలనలోని మద్యం పాలసీ, ఇసుక పాలసీలపై ఆమె పోరాటం చేస్తున్నారు.. వీటిపై భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకి సైతం ఫిర్యాదు చేశారు.. పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి విరుచుకుపడుతున్నారు.. కేవలం, తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కాపాడుకునేందుకే ఆమె ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఇది కమ్మటి బంధం కోసం, కులం కోసమే ఇలా చేస్తున్నారని విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు..
వైసీపీ సర్కార్ ఇసుక అక్రమాలను ప్రశ్నించిన పురంధేశ్వరిపై తాజాగా విజయసాయి రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.. ఆమెపై తీవ్ర అభియోగాలు మోపారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్…మళ్లీ బీజేపీ…ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే…ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది.
ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతయతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తంచేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సిబిఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా? ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా ?హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? అని సుదీర్ఘంగా తన ట్విట్టర్ వాల్‌పై పోస్టులు సంధించారు..
విజయసాయి రెడ్డి ట్వీట్లు వైరల్ కావడంతో, పురంధేశ్వరి సీరియస్ అయ్యారు.. ఆమె వెంటనే విజయసాయి రెడ్డిపై ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి ఫిర్యాదు చేశారు.. గత కొన్నాళ్లుగా బెయిల్ పై ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.. మరి, సీజీఐ ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపడతారో అనేది చర్చనీయాంశంగా మారింది.
అయితే, పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి పర్సనల్ ఎటాక్‌కి దిగడం వెనక అసలు కారణం… బీజేపీతో వైసీపీ సంబంధాలు దెబ్బతింటున్నాయని భావిస్తోందట ఆ పార్టీ హైకమాండ్.. మరికొందరు మాత్రం.. ఈ ఇద్దరిదీ డ్రామా అని, కేవలం టీడీపీని కార్నర్ చేయడానికే నాటకం ఆడుతున్నారని అనుమానిస్తున్నారు.. వీటిలో ఏది నిజమో తెలియదు కానీ, అసలు నిజాలు త్వరలోనే బయట పడతాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు..