మహేష్ – పూరీ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఫాన్స్ కి పండగే. మహేష్ – పూరీ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేశాయి. ముఖ్యంగా వీరి కలయికలో వచ్చిన ‘పోకిరి’ సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అప్పటివరకు ఉన్న పెద్ద హీరోల సినిమాలను పక్కకు నెట్టేసి తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కోసం ఎంత మాట్లాడుకున్న తక్కువే. మణిశర్మ అందించిన సంగీతం, పూరీ మహేష్ తో చెప్పించిన డైలాగ్స్ ‘పోకిరి’ సినిమాకు ప్రధాన బలం.
‘పోకిరి’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకోని మహేష్ తో ‘బిజినెస్ మెన్’ సినిమాను తెరకెక్కించాడు పూరీ. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్ కి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పూరీ, మహేష్ కోసం కథ సిద్ధం చేసాడని టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ‘జనగనమణ’ అనే టైటిల్ తో కథను సిద్ధం చేసాడని త్వరలోనే మహేష్ కు కథను వినిపించాలనుకుంటున్నాడట పూరీ. ఆల్రెడీ ఒకసారి ఈ కథను వినిపించాడు పూరీ. అప్పుడు మహేష్ కి కథ నచ్చలేదు. కొన్ని మార్పులు చేయాలని సూచించాడు మహేష్. ఆ తరువాత మళ్ళీ ఆ కథ మీద వీరిద్దరూ కలవలేదు.
మొన్నీమధ్య పూరీ ‘జనగనమణ’ సినిమాని రానాతో చేయలన్నా ఎందుకనో కుదరలేదు. ఇక ఇటివలే మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ పూరీ కథ చెబితే వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కథ నచ్చితే తప్పకుండ పూరీతో సినిమా చేస్తానని మహేష్ తెలిపాడు. మహేష్ స్పందనతో పూరీ మరల ‘జనగణమన’ కథను మార్పులు చేసి సిద్ధంగా ఉంచాడని సమాచారం. భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ ‘జనగనమణ’ కథను పూరీ రాస్తున్నాడని సమాచారం. ఈ వార్త కనుక నిజమైతే మహేష్ ఫాన్స్ కు పండగే అనడంలో సందేహం లేదు.