ఐటీ..ఈ మాట వింటే దేశంలో గుర్తొచ్చే ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. టెక్నాలజీని వాడుకోవడంలో ఆయన అందరికంటే ముందుంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని భారీగా ఉద్యోగాలు కల్పించాలని, వేగంగా రాష్ట్రాభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్లాన్. ఇందుకు తగ్గట్టుగానే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు.
2026 జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభిస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఇందులో భాగంగా మొదట అమరావతిలో క్వాంటమ్ టవర్ నిర్మించనున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ భవనానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనిని 40,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఐతే 3 నెలల్లోనే భారీ బిల్డింగ్ నిర్మించడం ఆసాధ్యం. ఐతే ఇందుకు 3D టెక్నాలజీ ఉపయోగిస్తారని తెలుస్తోంది.
ఏంటీ ఈ 3D టెక్నాలజీ –
భవనంలో కొంత భాగాన్ని పునాదుల వరకు సాధారణ పద్దతిలోనే నిర్మిస్తారు. మిగిలిన భాగాన్ని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ప్రింట్ చేసి ముందుగా నిర్మించిన భవనానికి జోడిస్తారు. అంటే రెడీ మేడ్ గోడలు, స్లాబులు, గదులను 3డీలో ప్రింట్ చేసి తర్వాత ఒకదానితో మరో దానిని జోడిస్తారు. దీంతో 3 నెలల్లోనే నిర్మాణం పూర్తి కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
3D ప్రింటింగ్ కోసం అవసరమైన కంప్యూటర్లు, యంత్రాలు అన్నీ రెడీ చేశారు. దీని కోసం ఇప్పటికే డిజైన్ కూడా ఫైనల్ అయింది. శంకుస్థాపన తర్వాతే డిజైన్ విడుదల చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి ఒకటి రెండు రోజుల్లో టెండర్లు ఖరారు చేయనున్నారు











