తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం.. ఆతర్వాత అస్వస్థకు గురవ్వడంతో రాజకీయాల్లోకి రానని ప్రకటించడం తెలిసిందే. రజనీ సడన్ గా రాజకీయాలకు నో చెప్పడంతో ఆయన అభిమానులను నిరాశపరిచింది. రజనీ అభిమానులైన కొంత మంది సెలబ్రిటీలను కూడా నిరాశపరిచింది. రజనీ స్నేహితుడు కమల్ హాసన్ సైతం రజనీ అభిమానులు వలే నేను కూడా నిరాశపడ్డానని చెప్పారు.
Must Read ;- రజనీ మద్దతు ఎవరికి.. కమల్ కా.? బీజేపీకా.?
ఇదిలా ఉంటే.. ఇప్పుడు రజనీ నిర్ణయం పై రాఘవ లారెన్స్ స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందే అని అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. తన పైనా ఒత్తిడి తెస్తున్నారని అందువల్ల వివరణ ఇవ్వాల్సి వస్తోంది అంటూ రాఘవ లారెన్స్ తాజాగా ట్విట్టర్ లో ఓ నోట్ ని రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ లేఖలో ఏం రాసారంటే… తలైవా నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లోకి రావాలని చెప్పాలంటే తన పై అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు.
రజనీ సర్.. రాజకీయాల్లోకి రానని చెప్పడంతో అభిమానులు ఎలాగైతే బాధపడుతున్నారో నేను కూడా అలాగే ఫీలవుతున్నాను. అయితే.. ఆయన వేరే కారణం చెప్పుంటే అడగొచ్చు కానీ.. అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నాను అని చెప్పారు. ఇలాంటి సమయంలో ఒత్తిడి మేరకు ఆయన రాజకీయాల్లోకి వస్తే అప్పుడేదైనా జరగరానిది జరిగితే ఆ బాధను జీవితాంతం మర్చిపోలేం. ఆయన ఆరోగ్యం ఎంత వరకూ సహకరిస్తుందో నాకు బాగా తెలుసు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని సర్వదా ప్రార్థిద్దాం.. నా ప్రార్థనలు ఎప్పటికీ ఉంటాయి. గురువే శరణం అని లేఖలో రాశారు లారెన్స్.