వైసీపీ అసంతృప్త ఎంపీ, వైసీపీ రెబల్ ఎంపీగా గుర్తింపు దక్కించుకున్న రఘురామ కృష్ణం రాజు .. సొంత పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు.. గత మూడేళ్లుగా జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రఘు రామ కృష్ణం రాజు కోర్టులలోనూ అనేక కేసులు వేశారు.. తాజాగా ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఊహించని తీర్పు వచ్చింది.. గత పదేళ్లలో జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసులో 3041 సార్లు వాయిదాలు పడ్డాయని పిటీషన్‌లో వివరించారు.. ఇంత కాలం విచారణ జరగకుండా ఆలస్యం అవుతోందని, జగన్ కేసుల్లో తీర్పు త్వరిత గతిన సాగుతున్నాయని, ఈ కేసులో మరో రాష్ట్రానికి తరలించాలని కోరారు రఘురామ కృష్ణం రాజు..
రఘురామ పిటీషన్‌ని స్వీకరించిన సుప్రీం కోర్టు.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. ఇటు, జగన్, ఆయనతో కేసులలో ఉన్న ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ లిస్టులో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.. అయితే, ఈ కేసుని ఫైల్ చేసింది ఎవరు అని ప్రశ్నిచింది సుప్రీం కోర్టు.. వైసీపీ సొంత ఎంపీ అని వివరించారు రఘురామ కృష్ణం రాజు తరఫు అడ్వకేట్.. ఇది రాజకీయ కక్ష కోణంలో కోరుకుంటున్న విచారణ కాదని, అవినీతి కేసులలో విచారణను వేగంగా కోరుకుంటున్నామని కోర్టుకు విన్నవించారు..
తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిల్లో ఆయన కడిగిన ముత్యంలా బయటికి రావాలని కోరుకుంటున్నామని వివరించారు.. ఇది వినడానికి కాస్త సర్కాస్టిక్‌గా ఉన్నా… అంగీకరించాల్సిన వాదనగా మారింది.. దీంతో, వెంటనే జగన్, ప్రతివాదులతోపాటు సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.. ఈ కేసుని జనవరికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు..
మొత్తమ్మీద, జగన్ ప్రతిపక్ష నేతలను కేసులతోనే అణగదొక్కాలని చూస్తున్నారనే వాదన మొదలయింది.. ఇదే టైమ్ లో ఆయనని సైతం కోర్టులో కేసులతోనే ఇరుకున పెట్టాలని చూస్తున్నారు ప్రత్యర్ధులు.. మరి, ఈ న్యాయ యుద్ధంలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి..