వైఎస్ విజయమ్మ.. ప్రస్తుతం వైసీపీ గౌరవ అధ్యక్షురాలు.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. తన కొడుకు స్థాపించిన వైఎస్సార్సీసీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో విజయమ్మ ఓడినప్పటికీ.. పార్టీ లోనూ క్రియాశీలకంగా మారారు. పాలన విషయాల్లోనూ తరచుగా కుమారుడికి సలహాలిస్తూ తన ప్రాధాన్యం ఏమిటో చాటుకుంటున్నారు. అయితే తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టిన.. తన కుమార్తె వైఎస్ షర్మిలకు విజయమ్మ అన్నీ తానై వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. షర్మిల ఏ సభ పెట్టినా, ఏ దీక్షలకు దిగినా.. బిడ్డతో కలిసి విజయమ్మ దర్శనమిస్తుండటం వైసీపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదనే ఆరోపణలొస్తున్నాయి.
విజయమ్మపై చర్యలు తీసుకుంటారా?
గురువారం వైఎస్ షర్మిల హైదరాబాద్ లో తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. అయితే వైసీసీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ.. షర్మిల సభకు హాజరై తన బిడ్డను ఆశీర్వదించాలని పిలుపునివ్వడం పలు విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు.. గత కొన్ని నెలలుగా విజయమ్మ షర్మిల వెంట నడుస్తుండటటం.. షర్మిల నిర్వహించ తలపెట్టిన ప్రతి సమావేశానికి హాజరవుతుండటం.. వైసీసీలో తీవ్ర చర్చకువస్తోంది. ఒక పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ.. షర్మిల ప్రారంభించిన మరో పార్టీ సభకు ఎలా అటెండ్ అవుతారని?.. సీఎం జగన్ పై ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నా షర్మిలను ఎందుకు కంట్రోల్ చేయడం లేదని వైసీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాను మరిచిన… తన తల్లి విజయమ్మను జగన్ గెంటేస్తారా? అని సరికొత్త సవాల్ విసరడం సంచలనంగా మారింది. పార్టీ క్రమశిక్షణారహిత్యం కింద తల్లి విజయమ్మపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయాల్సిన అవసరం ఉందని రఘురామ డిమాండ్ చేశారు.
రెడ్డి ఎంటర్ప్రైజెస్ మద్యం దందా
తాజా లేఖలో ఏపీబీసీఎల్ సిబ్బంది, రెడ్డి ఎంటర్ప్రైజెస్ వసూళ్ల విషయాన్ని కూడా రఘురామరాజు ప్రస్తావించారు. మద్యం దుకాణాల నుంచి 5 కోట్ల రూపాయల వసూళ్లకు రెడ్డి ఎంటర్ప్రైజెస్ ప్లాన్ చేసిందని తెలిపారు. 19,258 మంది ఉద్యోగులకు నెల జీతం చెల్లించాలంటూ రెడ్డి ఎంటర్ప్రైజెస్ వారు మద్యం షాపుల నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారని ఆరోపించారు. డిప్యూటీ సీఎంకి ఫిర్యాదు చేసినా.. విచారణ జరగలేదని నిలదీశారు. వెంటనే దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామరాజు డిమాండ్ చేశారు.
Must Read ;- విజయమ్మ సపోర్టు షర్మిలకే..