రోజుకో విమర్శతో ప్రతి పక్ష పార్టీలకన్నా ఎక్కువగా మీడియా ముందుకొచ్చి అధికార వైసీపీ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న రాజు గారు ఈసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. గత కొన్ని నెలలుగా తాను వినియోగించే రెండు ఫోన్ నెంబర్లను ట్యాప్ చేస్తున్నారని, కొన్ని రోజులుగా కాల్స్ మాట్లాడే అప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ను ఉల్లంఘించడమేనని అంతేగాకుండా తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.