యంగ్ హీరో రాజ్ తరుణ్ .. సరైన సక్సెస్ సాధించి చాలా కాలమైపోయింది. ఇప్పటి వరకూ అతడి కెరీర్ లో ‘ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ’ లాంటి హిట్స్ మాత్రమే ఉన్నాయి. వీటి తర్వాత ఆ రేంజ్ లో హిట్ సినిమా మరొకటి దక్కలేదు అతడికి. అయినప్పటికీ ఆ టాలెంటెడ్ హీరోకి అవకాశాలు మాత్రం ఆగలేదు. ఎప్పటికప్పుడు కొత్త గా ట్రై చేస్తున్నప్పటికీ.. అదృష్ట దేవత మాత్రం అతణ్ణి కనికరించడం లేదు. ఈ పరిస్థితుల్లో రాజ్ తరుణ్ .. ఒకే ఒక సినిమా మీద హోప్స్ పెట్టుకున్నాడు. అదే ‘స్టాండప్ రాహుల్’.
పరమ బద్ధకిస్టైన రాహుల్ అనే యువకుడు స్టాండప్ కమెడియన్ గా ఎలా రాణించాడు అన్నదే సినిమా కథాంశం. నేడు రాజ్ తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా స్టాండప్ రాహుల్ సినిమాకి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో .. నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి కూర్చుంది చాలు అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ పెట్టారు. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Wishing boy-next-door @itsRajTarun, Happy Birthday & an outSTANDing year ahead!✨#StandUpRahul will be arriving soon to bring smiles on your double masked faces! 😷@VarshaBollamma
@mohan_veeranki@SweekarAgasthi@sidhu_mudda @Nandu_Abbineni @bharath1985#HBDRajTarun pic.twitter.com/BluFpDn53Q— BA Raju's Team (@baraju_SuperHit) May 11, 2021











