శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్త’. నయనతార, కీర్తిసురేష్, ఖుష్బూ, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ‘దర్బార్’ తర్వాత రజినీ నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో.. ఈ సినిమా మీద ఎంతో ఆసక్తిగా ఉన్నారు అభిమానులు.
‘అన్నాత్త’ మూవీ నెలరోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా యూనిట్ మొత్తం పీపీయీ కిట్స్ తోనే పనిచేస్తున్నారు. అలాగే.. షూటింగ్ సమయంలో సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించారు ముఖ్యంగా రజనీకాంత్ కి చాలా దూరంగా ఉంటూ చిత్రీకరణ చేశారు. రీసెంట్ గా ‘అన్నాత్త’ సినిమాలోని రజనీకాంత్ పోర్షన్ కంప్లీట్ అయిందని సమాచారం. దీంతో రజనీ చెన్నై బయలు దేరి వెళ్ళారని సమాచారం.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన షెడ్యూల్ లో అందాల నయనతార కూడా పాల్గొందట. ఓ వారం విశ్రాంతి తీసుకొని రజనీకాంత్ ‘అన్నాత్త’ సినిమాకి డబ్బింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు సన్ పిక్చర్స్ వారు. ‘చంద్రముఖి, దర్బార్’ చిత్రాల తర్వాత రజనీ, నయనతార కలయికలో వస్తున్న ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.