నందమూరి బాలకృష్ణ , దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక వచ్చే నెల నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మరో వార్తా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే బాలయ్య మూవీలో హీరో రాజశేఖర్ కనిపించబోతున్నారట. రాజశేఖర్ ఒక వైపు హెరోగా చేస్తూనే తాను విలన్ పాత్రలు చేయడానికి సిద్ధం అని ఇప్పటికే సంకేతాలిస్తున్నారు..ఈ నేపధ్యంలో బాలయ్య మూవీ కోసం డైరెక్టర్ అనిల్ ఇప్పటికే రాజశేఖర్ ను ఒప్పించారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు రాజశేఖర్ హీరోగా తప్ప మరో పాత్రలో తెరపై కనిపించలేదు.ఇక ‘బలరామకృష్ణులు’ సినిమా తరువాత ఆయన మల్టీస్టారర్ లు చేసింది కూడా లేదు.ఈ క్రమంలో బాలయ్య మూవీలో రాజశేఖర్ పాత్ర పై అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ కాగా..ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది.ఇక హీరోయిన్స్ గా ప్రియమణి, మెహ్రీన్ ల పేర్లు వినిపిస్తుండగా, హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నారని టాక్. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’లో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని ఒప్పించిన అనిల్ రావిపూడి, రాజశేఖర్ ను కూడా ఒప్పించడం విశేషంగా మారింది.ఇక ఈ సినిమాలో రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ నే ఉంచుతున్నారని వినికిడి.
మొత్తానికి బాలయ్య, రాజశేఖర్ కాంబినేషన్ ఎలా ఉండబోతోందనేది ఇద్దరి అభిమానుల్లో మాత్రం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.మరి ఈ మూవీలో రాజశేఖర్ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి.