ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న తమిళ ప్రజలకు తియ్యటి కబురు చెప్పారు రజనీ కాంత్. మొత్తానికి తన రాజకీయ ఎంట్రీని కన్ఫర్మ్ చేసి అభిమానుల సందిగ్దాన్ని తొలగించారు. డిసెంబర్ 31న పార్టీని ప్రకటించి, 2021లో సరికొత్తగా పార్టీని ప్రారంభించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రజనీ పార్టీ తమిళ రాజకీయాల్లో ఎంతమేర ప్రభావం ఉంటుందనేది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్లాలంటే, ముఖ్యంగా నిరక్ష్యారాసుల పార్టీని గుర్తించాలంటే దానికి సరైన గుర్తు కావాలి. ఇప్పుడే రజనీ దానిపైనే మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. రజనీ పార్టీ గుర్తుగా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ని ఫాలో అవబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
పేద ప్రజల ఎజెండాతో దూసుకుపోయిన అన్నగారు
పేద, మధ్యతరగతి ప్రజలకు కావాల్సింది తినడానికి తిండి, మంచి బట్టలు, ఉండాడానికి ఇల్లు అనే ఎజెండాతో తెలుగునాట ప్రభంజనాన్ని సృష్టించారు ఎన్టీఆర్. తన ఎజెండా ప్రజల్లోకి వెళ్లడానికి అవే గుర్తులతో పార్టీ జెండాను స్వయంగా రూపొందించారు అన్నగారు. సామాన్యుడు సైతం గుర్తించేలా ‘సైకిల్’ని పార్టీ గుర్తుగా ఎంచుకుని తన మనసులోని ఉద్ధేశాన్ని ఇలా గుర్తుల రూపంలో ప్రజలకు స్పష్టంగా అర్ధమయ్యేలా తెలియజేయడంలో ఎన్టీఆర్ విజయం సాధించారు కాబట్టే ఎన్నికల్లో కూడా ఊహించని ఫలితాలను అందుకుని కేవలం ఏడంటే ఏడే నెలల్లో సిఎం కుర్చీని అందుకున్నారు.
అదే ట్రెండ్‌ని ఫాలో రజనీ ఫాలో అవుతున్నారా?
తరాలు మారినా ఎన్టీఆర్ చరిష్మా తరగనిది. అదే పాయింట్‌ని తన తరహాలో చూపించడానికి రజనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ గుర్తుగా సైకిల్ని ఎంచుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దానితో పాటు సామాన్యులకు మరింత దగ్గరవ్వడానికి పాల క్యానును తగిలించి ఉన్న సైకిల్ని గుర్తుగా ఎంచుకోబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు పార్టీ జెండాకు మూడు రంగులు ఉంటాయని, ఒక్కో రంగు ఒక్కో ప్రత్యేకత ఉండేలా రూపకల్పన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీటిపై ఇంకొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అన్నగారిపై ఉన్న అభిమానాన్ని పలు సందర్భాల్లో రజనీ తెల్పుతూనే వచ్చారు. అప్పటి మాటలు కూడా, నేటి వార్తలకు ఊతమిస్తుంది.
Must Read ;- రజనీకాంత్ చరిత్ర సృష్టిస్తారా..? చరిత్రలో కలిసిపోతారా..?