కోర్ట్ ధిక్కారణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం కోర్టు రూపాయ్ ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 లోపు జరిమానా చెల్లించకపోతే మూడు నెలలు జైలు శిక్ష మరియు మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేయకుండా నిషేధిస్తామని కోర్ట్ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్…ప్రశాంత్ భూషణ్ కు రూపాయి ఇచ్చి సహకరించారు. ఆయన ఇచ్చిన రూపాయిను తీసుకున్న ప్రశాంత్ భూషణ్ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ప్రశాంత్ సుప్రీంలో ప్రశాంత్ భూషణ్ తరుపు వాదనలు వినిపించింది కూడా రాజీవ్ ధావనే కావడం గమనార్హం. కానీ సుప్రీంకి ఫైన్ చెల్లించాలా? వద్దా? అనే విషయాన్ని త్వరలోనే తెలియచేస్తానని స్పష్టం చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డేను, సుప్రీంకోర్టును విమర్శిస్తూ ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. క్షమాపణ చెప్పమని సుప్రీం ఆదేశించింది. కానీ ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోలేదు. అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం క్షమాపణ చెప్పడానికి సమస్యలేంటని ప్రశ్నించిన ఆయన చెప్పేలేదు. ఈ విషయంలో అటార్నీ జనరల్ వేణుగోపాల్ హెచ్చరించి వదిలివేయాలని సుప్రీంకు తెలియచేశారు. ఆయన చెప్పిన మేరకు సుప్రీం ఫైన్ విధించినట్లు న్యాయనిపుణులు చెబుతున్నారు.