రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘క్రాక్’ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తరువాత ఇక్కడి థియేటర్స్ కి వచ్చిన పెద్ద సినిమా ఇదే. దాంతో ఈ సినిమా థియేటర్స్ లో నిలబడుతుందా? అసలు జనం వస్తారా? అనే డౌట్ చాలామందిలో ఉండేది. ఆ అనుమానాలను .. సందేహాలను పటా పంచలు చేస్తూ ఈ సినిమా దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. కొత్త ఉత్సాహంతో రవితేజ అభిమానుల చేత విజిల్స్ కొట్టిస్తోంది.
ఈ సినిమా చూసిన ప్రముఖులు చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా చరణ్ కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. “ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను .. నా ఫేవరేట్ హీరో రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. శ్రుతి హాసన్ చాలా గొప్పగా చేసింది. సముద్రఖని .. వరలక్ష్మీశరత్ కుమార్ చాలా ఈజ్ తో చేశారు. ఎవరి పాత్రకి వారు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా తమన్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది. ఇంత పెర్ఫెక్ట్ గా ఇలాంటి సినిమాను అందించిన గోపీచంద్ మలినేని టీమ్ కు శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశాడు.
రవితేజ .. శ్రుతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా, తొలిరోజు నుంచి భారీవసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ మళ్లీ ఇన్నాళ్లకి సెట్ అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరియర్లో తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. మసాలా అంశాలు పుష్కలంగా దట్టించిన కారణంగా, మాస్ ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులు కొట్టేసింది. రేపు రామ్ హీరోగా ‘రెడ్’ .. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ థియేటర్స్ కి రానున్నాయి. ఆ సినిమాల ప్రభావం, ‘క్రాక్’ వసూళ్లపై ఏమైనా పడుతుందేమో చూడాలి.
Must Read ;- 7 భాషల్లో విడుదల కాబోతోన్న రామ్ ‘రెడ్’ మూవీ
Enjoyed #Krack a lot!
My fav @RaviTeja_offl garu in top form! @shrutihaasan was at her best. @thondankani & @varusarath5 pulled off their characters with ease. @MusicThaman's BG score held the movie very well!
Your execution is top-notch @megopichand. Congrats to the entire team— Ram Charan (@AlwaysRamCharan) January 13, 2021