ఉపాసన కొణిదెల.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే అపోలో హాస్పటల్స్ అధినేత మవనరాలిగా.. పలు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుంటుంది. అలాగే ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ మ్యాగజైన్ ను కూడా రన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని చాటి చెబుతూ.. హెల్త్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ.. అవగాహన పెంచుతున్నారు.. ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.
ఇదిలా ఉంటే… సమయం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్యంగా చరణ్ తో ఉన్న పిక్స్ షేర్ చేస్తుంటారు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో ఉపాసన సందడి చేసింది. ఆ వేడుకల్లో చరణ్ తో ఉన్నఫోటోలను షేర్ చేసారు. నిహారిక మెహందీ వేడుకలో చరణ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసారు.
అలాగే.. ఉపాసన మామ – అత్త చిరంజీవి, సురేఖ దంపతులతో కలిసి చరణ్, ఉపాసన ఉన్న ఫోటోను, అలాగే చరణ్ సూపర్ గా రెడీ అయిన ఫోటోను, లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఓ వైపు ఆర్ఆర్ఆర్ మూవీ, మరో వైపు ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ రెండు సంచలన చిత్రాలు ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Must Read ;- కళ్ళు చెదిరే రీతిలో ‘ఆచార్య’ టెంపుల్ టౌన్ సెట్