నేడు డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి ఎందరో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపి.. ఆయనతో తమకు గల అనుబంధాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం వి.వి.వినాయక్ ‘శీనయ్య’ అనే సినిమాలో హీరోగా నటిస్తూనే .. మరో పక్క చిరంజీవి హీరోగా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోయే ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ కి స్ర్కిప్ట్ సమకూర్చే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీలో ఉండి కూడా తన పుట్టిన రోజు సందర్భంగా ఎంతో ఓపిగ్గా ప్రముఖ హీరోల నుంచి దర్శకులనుంచీ శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు.
వారిలిస్ట్ లోకి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరాడు. రామ్ చరణ్ ఈ రోజు వినాయక్ ఆఫీస్ కు స్వయంగావచ్చి పుష్ప గుఛ్చం ఇచ్చి.. ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక్ రామ్ చరణ్ తో ‘నాయక్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ తొలి సారిగా ద్విపాత్రాభినయం చేసి.. సూపర్ హిట్టు కొట్టాడు. అందుకే ఆ అనుబంధానికి గుర్తుగా రామ్ చరణ్ . వివి వినాయక్ ను కలవడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
Mega Powerstar @AlwaysRamCharan's Birthday Wishes To Mega Director #VVVinayak #HBDVVVinayak pic.twitter.com/m9Rw6sVwON
— BARaju (@baraju_SuperHit) October 9, 2020